మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

పెద్దేముల్/బషీరాబాద్: సీనియర్ జర్నలిస్టు శెట్టి రవిశంకర్‌ను తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఇటీవల సీనియర్ జర్నలిస్టు తల్లి మృతిచెందడంతో ఎమ్మెల్యే బుధవారం ఆయన ఇంటికి వెల్లి ఆయన తల్లి మృతిపట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళిగౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్‌నాయక్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఇటీవల మృతి చెందిన మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు డి.నర్సింహులు, దామర్‌చెడ్ మాజీ సర్పంచ్ రాజన్‌గౌడ్ కుటుంబాల సభ్యులను బుధవారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి గ్రామాలకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి నవాల్గలోని డి.నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించారు. వీరి వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ఎ.వెంకట్‌రాంరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, టీఆర్‌ఎస్ నేత ఇందర్‌చెడ్ నర్సిరెడ్డి, పీఎసీఎస్ మాజీ వైస్ చైర్మన్ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.