‘ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలి’

ABN , First Publish Date - 2021-08-21T04:40:35+05:30 IST

‘ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలి’

‘ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలి’
సంగాయిపల్లితండాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్‌

తాండూరు: ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాజీనామా చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం యాలాల మండలం సంగాయిపల్లితండా, పెద్దేముల్‌ మండలం కందనెల్లిలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు రూ. 10లక్షల చొప్పున ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినందున, తాండూరు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే ఇక్కడా పది లక్షలు వర్తిస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మోసం చేస్తోందన్నారు. జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కిరణ్‌, యాలాల మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భీమప్ప, పెద్దేముల్‌ జడ్పీటీసీ దారాసింగ్‌, ఉత్తమ్‌చంద్‌, వాజిద్‌, రమేష్‌, నారాయణరెడ్డి, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T04:40:35+05:30 IST