ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2021-02-06T04:59:32+05:30 IST

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
యాచారం : దర్గాలో ప్రార్థనలు చేస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అబ్బాస్‌ షా దర్గా షరీఫ్‌ ఉర్సు ఉత్సవాల్లో  ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వమతాలను గౌరవించే సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉందని అందుకే వివిధ దేశాలు మన సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తాయన్నారు. దర్గా అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. ముస్లింలకు శ్మశానవాటిక నిర్మాణానికి చొరవ తీసుకుంటానని అన్నారు. కాగా నందివనపర్తి పంచాయతీ  పరిధి కొమ్మోనిబాయి గ్రామంలో మిషన్‌భగీరథ పథకం ద్వారా ఓహెచ్‌ఎ్‌సఆర్‌ ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నందివనపర్తి అభివృద్ధికి సహకారం అందిస్తానని సర్పంచ్‌ ఉదయశ్రీకి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, మండల సహకార సంఘం చైర్మన్‌ టి.రాజేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ యాదయ్య, ఎంపీటీసీలు ఎం.శివలీల, శారద, నాయకులు బిలకంటి శేఖర్‌రెడ్డి, ఖాజా, జావేద్‌, నిరంజన్‌రెడ్డి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.  


సీఎం సహాయ నిధి పేదలకు వరం

ఇబ్రహీంపట్నం రూరల్‌/ఆదిభట్ల: ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదలకు వరంగా నిలుస్తోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం అందచేశారు. కప్పాడు గ్రామానికి చెందిన గుండిమల్ల కల్పనకు రూ.26వేలు, ఉప్పరిగూడకు చెందిన మడుపు యాదమ్మ కు రూ.60వేలు, పోరెడ్డి భారతమ్మకు రూ.26వేలు, రాయపోల్‌ గ్రామానికి చెందిన చిన్నేల పోచమ్మకు రూ.56వేలు, రావుల యాదయ్యకు రూ.34వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యంపల్ల నిరంజన్‌రెడ్డి,సర్పంచులు బూడిద రాంరెడ్డి, గంగిరెడ్డి బల్వంత్‌రెడ్డి, సామల హంసమ్మ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, ఎంపీటీసీలు అచ్చనశ్రీశైలం, గంగిరెడ్డి జ్యోతి, ఉపసర్పంచ్‌ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి రాందా్‌సపల్లికి చెందిన యాదమ్మకు రూ.26వేలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. శుక్రవారం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు.

Updated Date - 2021-02-06T04:59:32+05:30 IST