తాత్కాలిక వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-11-03T05:04:41+05:30 IST

తాత్కాలిక వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే

తాత్కాలిక వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే
తాత్కాలిక వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ధారూరు: నాగసమందర్‌ -రుద్రారం గ్రామాల మధ్య కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగుపై వంతెన తెగిపోవడంతో చేపట్టిన తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌ మంగళవారం పరిశీలించారు. ఈ తాత్కాలిక వంతెన నిర్మాణానికి  రూ.50లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వరద ప్రవాహానికి ఈ వంతెన తట్టుకుని నిలబ డుతుందని, ప్రజా రవాణ సౌకర్యం కలుగుతుందన్నారు. అనంతరం నాగసమందర్‌ ఎంపీటీసీ జగదేవి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు అనంతయ్యల కుమారుడు గురుమూర్తి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు రాజునాయక్‌, వేణుగోపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, వెంకటేశం, మల్లారెడ్డి, శివకుమార్‌, వంశీకృష్ణ పాల్గొన్నారు.  

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

బంట్వారం (కోట్‌పల్లి): పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. కోట్‌పల్లి మండల పరిధిలోని రాంపూర్‌ రైతువేదికలో మంగళవారం మండలానికి చెందిన 20మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అనిల్‌, రాంచంద్రారెడ్డి, వెంకటేష్‌యాదవ్‌, దశరథ్‌గౌడ్‌, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:04:41+05:30 IST