అదృశ్యమైన యువతి అడవిలో ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-02-27T04:34:16+05:30 IST

అదృశ్యమైన యువతి అడవిలో ఆత్మహత్య

అదృశ్యమైన యువతి అడవిలో ఆత్మహత్య

ధారూరు: వికారాబాద్‌ జిల్లాలో రెండు  నెలల క్రితం అదృశ్యమైన వివాహిత యువ తి అటవీ ప్రాంతంలో చెట్టుపై శవంగా మా రింది. పూర్తిగా కుళ్లిన పోయి మృతదేహన్ని, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింద ని పోలీసులు నిర్ధారించారు. ఈసంఘటన వికారాబాద్‌ జిల్లా ధారూరు మండల పరిధిలోని అల్లాపూర్‌ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇదే మండలంలోని గట్టేపలి గ్రామానికి చెందిన బోయ పద్మ మ్మ(21) మనస్పర్థలతో  భర్తతో విడిపోయి నాలుగేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. కాగా డిసెంబర్‌ 20న ఇంటి నుంచి వెళ్లిన పద్మమ్మ తిరిగి రాలేదు. యువతి అదృశ్యం పై తండ్రి నర్సింహులు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమో దు చేశారు. శుక్రవారం అల్లాపూర్‌ అటవీప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బందికి చెట్టుపై పూర్తిగా కుళ్లిపోయిన మృతదే హం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ తిరుపతిరాజు, ఎస్‌ ఐ-2 మల్లయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఆనవాళ్లను బట్టి మృ తురాలు బోయ పద్మమ్మగా గుర్తించా రు. మృతదేహం చె ట్టుకు వేలాడుతూ, శరీర భాగాలు చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడ్డాయి. వైద్యులు శరీర భాగాలను సేకరించి పోస్టుమా ర్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా భర్తతో విడిపోయిన పద్మమ్మ ఆత్మహత్యకు రెండో పెళ్లే కారణం గా ప్రచారం జరుగుతోంది. గ్రామానికి చెందిన ఓయువకుడితో ఆమెకు పరిచయమై ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అనంతరం జరిగిన గొడవల కారణంగానే ఆమె ఇంటి నుంచి అల్లాపూర్‌ అడువుల్లోకి వెళ్లినట్టు గుర్తించిన కుటుంబీకులు ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. చివరకు ఆమె మృతదేహం లభించింది.

Updated Date - 2021-02-27T04:34:16+05:30 IST