తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు

ABN , First Publish Date - 2021-07-09T04:32:07+05:30 IST

తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు

తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు

ఆమనగల్లు: మూడు రోజు క్రితం తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గురువారం పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆమనగల్లు శివారు వ్యవసాయ పొలాల్లో బుధవారం ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోలింగ్‌ కానిస్టేబుల్‌ రఘునాయక్‌,  హోంగార్డ్‌ భాస్కర్‌ పిల్లలను ఓదార్చి వారి నుంచి వివరాలను సేకరించారు. వారిని రామకృష్ణ(7), చింతు(6)గా గుర్తించి సామాజిక మధ్యమాలలో వారి ఫొటోలు, వివరాలు అప్‌లోడ్‌ చేశారు. విచారణలో చిన్నారుల తల్లిదండ్రులు కడ్తాల మండలం ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ లింగమ్మ కృష్ణయ్య, బోజ్జ స్వప్న జంగయ్యగా గుర్తించారు. తలకొండపల్లి మండలం మల్లప్పగుట్ట ప్రాంతంలో నివాసిస్తున్న వారి వద్దకు వెళ్లి పిల్లలను అప్పగించినట్లు సీఐ ఉపేందర్‌ తెలిపారు. 


Updated Date - 2021-07-09T04:32:07+05:30 IST