పక్కింట్లో దాక్కుని పరుగులు పెట్టించాడు!

ABN , First Publish Date - 2021-02-02T04:40:26+05:30 IST

పక్కింట్లో దాక్కుని పరుగులు పెట్టించాడు!

పక్కింట్లో దాక్కుని పరుగులు పెట్టించాడు!

షాద్‌నగర్‌రూరల్‌: పక్కింట్లో దాక్కుని గ్రామస్థులను, పోలీసులను ఓ వ్యక్తి పరుగులు పెట్టించిన సంఘటన ఇది. ఫరూఖ్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామానికి చెందిన బైరమోని శ్రీను శనివారం రాత్రి మరో ము గ్గురితో కలిసి గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువులో వలలు వేసి అందరూ ఇళ్లకు వచ్చారు. అదేరోజు రాత్రి 11గంటలకు ఇంటి నుంచి బయటకి వెళ్లిన శ్రీను చెరువు గట్టుపై తన దుస్తులు పెట్టి ఊళ్లోకి వచ్చి మరొకరి ఇట్లో దాక్కున్నాడు. ఆదివారం ఉదయం చెరువు గట్టుపై బట్టలు ఉండటంతో చెరువులో పడి మృతి చెంది ఉంటాడని భావించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  రాత్రి 11 గంటల తర్వాత గాలింపు జరుపుతుండగా ఒక మహిళ పోలీసులకు ఫో న్‌ చేసి ఇక్కడే ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. సోమవారం పోలీసులు గ్రామానికి చేరుకొని శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.   

Updated Date - 2021-02-02T04:40:26+05:30 IST