వ్యాక్సినేషన్‌కు వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2021-01-13T05:45:08+05:30 IST

వ్యాక్సినేషన్‌ ప్రారం భించే కేంద్రాల్లో నిర్ధేశించిన మార్గదర్శక నిబంధనల ప్రకారం

వ్యాక్సినేషన్‌కు వసతులు కల్పించాలి
మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • మంత్రి సబితారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వ్యాక్సినేషన్‌ ప్రారం భించే కేంద్రాల్లో నిర్ధేశించిన మార్గదర్శక నిబంధనల ప్రకారం వసతులను కల్పించాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సబంధిత అధికారులను ఆదేశించారు. కొవిడ్‌19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లను జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం తన కార్యాలయంలో సమీక్షిం చారు. ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను సమన్వయం చేసేం దుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యశాలల ఉద్యో గులకు, సిబ్బందికి ప్రభుత్వ సిబ్బందే వ్యాక్సినేషన్‌ చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద 108 అంబు లెన్స్‌ వాహనాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. తొలిరోజు 30 మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ వేస్తారన్నారు. మొదటి రోజు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 18వ తేదీ నుంచి ప్రతీ కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్‌ ఇస్తారన్నారు. 18వ తేదీన అన్ని ప్రాథమిక కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారం భం అవుతుందన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్‌, కాలె యాదయ్య, కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అధికారులు పాల్గొన్నారు. 


విద్యా సంస్థల్లో, వసతి గృహాల్లో ప్రమాణాలు పాటించాలి

ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్న సందర్భంగా కొవిడ్‌ నిబం ధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకో వాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కాకుండా కొత్త వాటిని వినియోగించాలని ఆదేశించారు. ప్రతీ వారం పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వ డాక్టర్లు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. Updated Date - 2021-01-13T05:45:08+05:30 IST