రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-01-21T04:36:10+05:30 IST
రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.

- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
నవాబుపేట : రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం నవాబుపేట మండలం ఎల్లకొండ, నవాబుపేట గ్రామాల్లో రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదికలు, నవాబుపేటలో రూ.38లక్షలతో నిర్మించిన స్ర్తీశక్తి భవన్, రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయం, రూ.20లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, అందుకు రాష్ట్రంలో 2,604 రైతువేదికలను నిర్మించామని ఆమె చెప్పారు. అనంతరం ఎల్లకొండ పార్వతీపరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
అనంతరం మండలంలోని 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీ వైస్‌చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ చైర్మన్ కొండల్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ జయమ్మ, ఎంపీపీ కాలె భవాని, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు రావుగారి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చిట్టెపు మల్లారెడ్డి, చిట్టెపు ఆనంద్‌రెడ్డి, తలారి ప్రభాకర్, మానసప్రకాష్, రంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, సర్పంచులు శ్రీనివాస్‌గౌడ్, బల్వంత్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి, విజయలక్ష్మి, ఎంపీటీసీ పద్మనాగిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.