మంత్రి మల్లారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2021-08-28T04:26:05+05:30 IST

మంత్రి మల్లారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

మంత్రి మల్లారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
కడ్తాల : మంత్రి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

  • డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి
  • రేవంత్‌పై మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నా


కడ్తాల్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలశీతలీకరణ కేంద్రం ఎదుట ధర్నా, రాస్తారోకో చేపట్టారు.  అనంతరం మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌, మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి మల్లారెడ్డి మతిభ్రమించినట్లుగా వ్యవహరిస్తున్నారని, స్థాయిని దిగజారి మాట్లాడుతున్నారని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, డీసీసీ నాయకుడు చేగూరి వెంకటేశ్‌ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి భేషరతుగా మంత్రి మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో హీరాసింగ్‌, బీచ్యానాయక్‌, రాంచందర్‌నాయక్‌, శ్రీను, మల్లయ్య, రాజేందర్‌గౌడ్‌, తులసీరామ్‌నాయక్‌, దేవేందర్‌గౌడ్‌, బోసు రవి, రాజేశ్‌, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి మల్లారెడ్డిపై పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు

శంషాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులకు టీపీసీసీ ఎస్సీవిభాగం ఉపాధ్యక్షడు జే.నరేందర్‌, మన్సిపాలిటీ అధ్యక్షుడు సంజయ్‌యాదవ్‌  ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-08-28T04:26:05+05:30 IST