ముగిసిన ధ్యాన వేడుకలు

ABN , First Publish Date - 2022-01-01T04:14:08+05:30 IST

కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని

ముగిసిన ధ్యాన వేడుకలు
వేణునాథ ధ్యానంలో సుభాష్‌ పత్రీజీ

ఆమనగల్లు : కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో మహిళా ధ్యాన మహోత్సవ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. మహిళా ధ్యానమహాచక్రం-3లో భాగంగా 11రోజులపాటు ధ్యాన సభలు వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ధ్యాన గురువు సుభా్‌షపత్రీజీ, స్వర్ణమాల పత్రీజీ, పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పత్రీజీ అఖండ వేణునాథ ధ్యానం మూడుగంటలపాటు సాగింది. ఈసందర్భంగా పత్రీజీ మాట్లాడుతూ తనను తాను సంస్కరించుకునేందుకు ధ్యానం గొప్ప సాధనమన్నారు. మందులతో నయం కాని ఎన్నో వ్యాధులు, రుగ్మతలు ధ్యానంతో జయించవచ్చన్నారు. ఆనందమయ జీవనానికి ఽధ్యానం గొప్ప ఔషధమని పేర్కొన్నారు. ధ్యా నంతో సద్గుణాలు అలవడుతాయన్నారు. అంతరిస్తున్న మానవతా విలువల పెంపునకు ధ్యాన, ఆధ్యాత్మి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ధ్యానం ద్వారా వినయశీలత, సంకల్పశక్తి సిద్ధించి ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని పత్రీజీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జర్పుల దశర థ్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, అన్మా్‌సపల్లి సర్పంచ్‌ శంకర్‌, పీఆర్వో రవిశాస్ర్తి, పిరమిడ్‌ ట్రస్ట్‌ సభ్యులు ప్రేమయ్య, మారం శివప్రసాద్‌, హనుమంతరావు, రాంబాబు, సాంబశివరావు, లక్ష్మి, దామోదర్‌రెడ్డి, మాధవి పాల్గొన్నారు. Updated Date - 2022-01-01T04:14:08+05:30 IST