నిర్లక్ష్యంగా వ్యాక్సిన్లు వేస్తున్న వైద్యసిబ్బంది

ABN , First Publish Date - 2021-09-04T04:36:45+05:30 IST

నిర్లక్ష్యంగా వ్యాక్సిన్లు వేస్తున్న వైద్యసిబ్బంది

నిర్లక్ష్యంగా వ్యాక్సిన్లు వేస్తున్న వైద్యసిబ్బంది
రక్తపు మరకను చూపిస్తున్న బాధితుడు ఆంజనేయులు

  • భుజానికి టీకా వేసిన వెంటనే రక్తం కారుతోందని స్థానికుల ఆందోళన

షాబాద్‌ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల పరిఽధిలోని చందనవెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం హైతాబాద్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ తీసుకునేందుకు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా టీకా వేయడంతో అతడికి వ్యాక్సిన్‌ వేసిన చోట రక్తం బయటకు వచ్చింది. దీంతో అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత చాలామందికి రక్తం బయటకు వస్తుందని వివరించారు. ఇదే విషయంపై నర్సు చంద్రకళను పలువురు ప్రశ్నించగా ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని అతడు తెలిపాడు. కనీసం చేయి కూడా పట్టుకోకుండా టీకా ఇస్తున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆంజనేయులు, పలువురు ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-09-04T04:36:45+05:30 IST