వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-13T05:28:44+05:30 IST

వివాహిత ఆత్మహత్య

వివాహిత ఆత్మహత్య

తలకొండపల్లి : అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లికి చెందిన వివాహిత కైస ర్‌ (35) అత్త, మామల వేధింపులు భరించలేక ఈనెల 10న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారకస్థితికి వెళ్లిన ఆమెను చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి మామ మైబెల్లి, అత్త బీబీ, మరిది జహంగీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-13T05:28:44+05:30 IST