మన్నెగూడ సర్పంచ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-03-25T04:30:18+05:30 IST

మన్నెగూడ సర్పంచ్‌ సస్పెన్షన్‌

మన్నెగూడ సర్పంచ్‌ సస్పెన్షన్‌

పూడూరు: మన్నెగూడ సర్పంచ్‌ వినోద్‌గౌడ్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ పౌసుమిబసు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 15రోజుల క్రితం సర్పంచ్‌ గ్రామంలో ఓ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్‌ ఇవ్వడానికి రూ.13లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి  పట్టుబడిన విషయం విదితమే. విచారణలో భాగంగా అతడిని అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. సర్పంచ్‌ సస్పెండ్‌ నేపథ్యంలో ఉపసర్పంచ్‌ సయ్యద్‌ ఆసి్‌ఫకు ఇన్‌ చార్జి సర్పంచ్‌గా బాధ్యతలు అప్పగించారు. వార్డుమెంబర్‌కు చెక్‌పవర్‌ ఇచ్చారు.

Updated Date - 2021-03-25T04:30:18+05:30 IST