ప్రత్యక్ష తరగతుల నిర్వహణ భేష్‌

ABN , First Publish Date - 2021-10-29T04:49:18+05:30 IST

ప్రత్యక్ష తరగతుల నిర్వహణ భేష్‌

ప్రత్యక్ష తరగతుల నిర్వహణ భేష్‌
విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి 


పరిగి: పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ భేషుగ్గా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. గురువారం పరిగి మునిసిపల్‌ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు కె.మహేశ్‌రెడ్డి, కాలె యాదయ్య, డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డితో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి విద్యార్థినులతో ముచ్చటించారు. లాక్‌డౌన్‌ అనంతరం ప్రత్యక్ష తరగతుల ప్రారంభం, తదితర ఆంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా భోజన సమయంలో చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2021-10-29T04:49:18+05:30 IST