చెరువులో పడి వ్యక్తి..
ABN , First Publish Date - 2021-12-10T04:52:33+05:30 IST
చెరువులో పడి వ్యక్తి..

చౌదరిగూడ: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌదరిగూడలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పత్తి ఆంజనేయులు(55)సంతకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి సాయంత్రం వరకూ రాలేదు. అతడి ఫోన్‌కు ఎంతగా ప్రయత్నించినా స్పందించకపోవడంతో కుటుంబసభ్యులు స్థానికంగా గాలించారు. చెరువు సమీపంలో కట్టపైన బట్టలు, సెల్‌ఫోన్ ఉండటంతో గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులు చెరువులో వెతకగా వలలో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.