రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-30T04:21:05+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

శంషాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పెద్దషాపూర్ పాత చెక్ పోస్టు హైదరాబాద్-బెంగుళూర్ హైవేపై శుక్రవారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగుళూర్ బోలెరా వాహనం ముందు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో బొలెరోలో ఉన్న హన్మంత (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రకా్‌షరెడ్డి తెలిపారు.