రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-06-23T03:50:13+05:30 IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొత్తూర్‌: మండల పరిధి ఇన్ముల్‌నర్వ శివారులో సోమవారం అర్ధరాత్రి బైక్‌ బో ల్తాపడి విస్లవత్‌ తులసికుమార్‌(33) అనే వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ సయూద్‌ తె లిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్‌కు చెందిన తులసికుమార్‌ కొడిచర్ల తండాలోని బంధువుల విందుకు హాజరై, బైక్‌పై తిరిగి వెళ్తుండగా వాహనం అదుపు తప్పి బో ల్తాపడి తులసికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తులసికుమార్‌ భార్య రాధి క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

సీఎస్కే విల్లాలో చోరీ

షాద్‌నగర్‌ రూరల్‌: షాద్‌నగర్‌లోని సీఎస్కే విల్లా్‌సలోని ఓ ఇంట్లో దొంగలు చో రీకి పాల్పడ్డారు. కొల్లి రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఇంటికి తాళం వేసి కేశంపేట వెళ్లా రు. మంగళవారం ఉదయం వచ్చిచూడగా తాళం విరగ్గొట్టి ఉంది. దీంతో అతడు ఫి ర్యాదు చేశాడు. ముందు జాగ్రత్తగా బంగారం, నగదు తన వెంట తీసుకెళ్లడంతో నష్టం జరుగలేదు. ఇంట్లోని రూ.25వేల గడియారం ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు.

Updated Date - 2021-06-23T03:50:13+05:30 IST