కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-22T05:24:13+05:30 IST
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఘట్‌కేసర్ రూరల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి చౌదరిగూడలో చోటుచేసుకుంది. చౌదరిగూడలో పిట్టల శ్రీరాములు(32) భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. రెండు నెలల క్రితం భార్యభర్తలు గొడవ పడటంతో భార్య పిల్లలతో కలిసి భువనగిరిలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత భార్యను తీసుకురావడానికి వెళ్లగా శ్రీరాములు కూడా వారితో భువనగిరిలోనే ఉన్నాడు. నాలుగు రోజులక్రితం అతడు చౌదరిగూడకు తిరిగి వచ్చి సోదరుడి వాటర్‌ప్లాంట్ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబుతెలిపారు.