ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2021-11-03T05:02:32+05:30 IST

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న చైర్మన్‌ రాంపాల్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య

ఆమనగల్లు: మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చైర్మన్‌ రాంపాల్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య అన్నారు. ఆమనగల్లు పరిధి 13వ వార్డు బుడగజం గాల కాలనీలో మహిళా శిశు సంక్షేమశాఖ నిధులు రూ.1.2లక్షలతో నిర్మించే అంగన్‌వాడీకి ప్రహరీ నిర్మాణానికి మంగళవారం వారు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ కృష్ణయ్య, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ శబరి, టీచర్‌ లక్ష్మమ్మ, కో-ఆప్షన్‌ సభ్యుడు శ్రీధర్‌, నాయకులు రేవల్లి యాదగిరి, వివేక్‌గౌడ్‌, రాము, రమేశ్‌, రాము, సుబ్బయ్య, భాస్కర్‌, ఆంజనేయులు, జంగమ్మ, అనంతమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:02:32+05:30 IST