మహర్షి వాల్మీకి జీవితం ఆదర్శం
ABN , First Publish Date - 2021-10-21T05:16:35+05:30 IST
మహర్షి వాల్మీకి జీవితం ఆదర్శం

వికారాబాద్/తాండూరు/బంట్వారం/ధారూరు/ మేడ్చల్ అర్బన్: మహర్షి వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శం అని వికారాబాద్ ఎమ్మెల్యే ఎం.ఆనంద్ అన్నారు. బుధవారం మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వేటగాడి జీవితం గడిపిన వ్యక్తి మహర్షి ఆదికవి కావడం మన దేశ సంస్కృతి గొప్పదనం అన్నారు. అదపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, బీసీ కమిషన్ సభ్యుడు శభప్రద్‌పటేల్, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ దళిత మోర్చా అధ్యక్షుడు నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్ పూలమాలలు వేశారు. పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీదేవి, పాల్గొన్నారు. తాండూరులోని వాల్మీకి నగర్‌లో జయంతిలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్ పాల్గొన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌ను ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. కులకచర్ల బీజేపీ కార్యాలయంలో వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద్‌రావు, వెంకటయ్యగౌడ్, మహిపాల్, శ్రీనివాస్, సురేందర్‌గౌడ్, క్రిష్ణారెడ్డి, శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు. బంట్వారం మండల బీజేపీ అధ్యక్షుడు హెచ్.మహేష్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ధారూరులో వాల్మీకి జయంతిని నిర్వహించారు. బీజేపీ మండలాధ్యక్షుడు రవీందర్‌గౌడ్, ఎం.రమేశ్ పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వాల్మీకి ఆదర్శపాయులని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.