వైభవంగా ఎల్లమ్మ జాతర

ABN , First Publish Date - 2021-03-06T04:47:58+05:30 IST

వైభవంగా ఎల్లమ్మ జాతర

వైభవంగా ఎల్లమ్మ జాతర
ఉత్సవాలను తిలకించేందుకు తరలివచ్చిన భక్తులు

  • కనులపండువగా సిడె ఘట్టం.. పోటెత్తిన భక్తజనం

బొంరా్‌సపేట్‌: పోలేపల్లి గ్రామంలో ఎల్లమ్మ జాతర శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమం కనుల పండువగా కొనసాగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ  ఊరేగించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలకు నియోజకవర్గంతో పాటు పూణె, షోలాపూర్‌, ముంబై తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, యాదగిరి, మహేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ, ఎంపీపీ తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. 

Updated Date - 2021-03-06T04:47:58+05:30 IST