లాక్‌.. పకడ్బందీగా!

ABN , First Publish Date - 2021-05-19T05:13:19+05:30 IST

లాక్‌.. పకడ్బందీగా!

లాక్‌.. పకడ్బందీగా!
నిర్మానుష్యంగా మారిన ఇబ్రహీంపట్నంలోని జాతీయ రహదారి

  • దుకాణాల మూత.. ఇళ్లకే జనం పరిమితం

ఇబ్రహీంపట్నం/కొత్తూర్‌/ఆమనగల్లు: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ మంగళవారం ఏడో రోజూ విజయవంతమైంది. దుకాణాలు మూసి ఉన్నాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. ఉదయం పది దాటిన తరువాత వ్యవసాయ, ఇతర అత్యవసర పనులకు తప్ప జనం బయటకు రాలేదు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా జరిగింది. రహదారులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. కొత్తూర్‌ మున్సిపాలిటీ, మండల పరిధి గ్రామాల్లో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల్లో సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐలు ధర్మేశ్‌, సుందరయ్య, వరప్రసాద్‌ ఆధ్వర్యంలో రోడ్లపై నిఘా ఏర్పాటు చేశారు. ఆమనగల్లు సర్కిల్‌లో లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై 300 కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. సడలింపు సమయంలోనూ భౌతికదూరం పాటించాలన్నారు.


  • బోసిపోయిన జాతీయ రహదారులు


కందుకూరు/చేవెళ్ల/మహేశ్వరం: ఏడో రోజు లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. కందుకూరు మండలంతోపాటు 35 గ్రామ పంచాయతీల్లో ఉదయం 10గంటలకే దుకాణాలు బంద్‌ చేశారు. హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై కందుకూరు, మహేశ్వరం పోలీసులు చెక్‌పోస్టు వద్ద పది తరువాత వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ మండలాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింది. హైదరాబాద్‌-బీజాపూర్‌, బెంగళూర్‌-ముంబాయి రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పది తరువాత వాహనాదారులు రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని చేవెళ్ల సీఐ విజయ్‌భాస్కర్‌రెడ్డి హెచ్చరించాడు. మహేశ్వరం మండలం, తుక్కుగూడ మున్సిపాలిటీలో విజయవంతమైంది. రూల్స్‌ అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఐ మధుసూదన్‌ హెచ్చరించారు.

Updated Date - 2021-05-19T05:13:19+05:30 IST