డ్వాక్రా సంఘాలకు రుణాలు

ABN , First Publish Date - 2021-08-28T05:03:05+05:30 IST

డ్వాక్రా సంఘాలకు రుణాలు

డ్వాక్రా సంఘాలకు రుణాలు
సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ మనోహార్‌రెడ్డి

కులకచర్ల: పాడి పరిశ్రమ అభివృద్ధికి డ్వాక్రా సంఘాల మహిళలకు డీసీసీబీ ద్వారా నాబార్డు నిధుల నుంచి రుణాలు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక రైతువేదికలో ఆయా గ్రామాలకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోనే కులకచర్ల మండలంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు ఆవులు, గేదెలు పెంచుకునేందుకు నాబార్డు నిధుల నుంచి రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. మొదటగా మండల పరిధిలోని 14గ్రామాల్లో ఐదుగురిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి రూ.5లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాబార్డు అధికారి షరీఫ్‌, డీసీసీబీ ఏజీఎం శైలజ, జీడీవో రాజ్‌కుమార్‌, జేఎల్‌జీ కో-ఆర్డినేటర్‌ కుమార్‌, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, బృంగి హరిక్రిష్ణ, పీరంపల్లి రాజు, సౌమ్యారెడ్డి, సుధాకర్‌రెడ్డి, శేరిరాంరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:03:05+05:30 IST