ఎస్సీ కార్పొరేషన్‌ లోన్లు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-11-03T05:03:29+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ లోన్లు ఇవ్వాలి

ఎస్సీ కార్పొరేషన్‌ లోన్లు ఇవ్వాలి
తహసీల్దార్‌కు వినతిపత్రమిస్తున్న కేవీపీఎస్‌ నాయకులు

ఇబ్రహీంపట్నం: దరఖాస్తు చేసుకొని అర్హతున్న అభ్యర్థులందరికీ ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్‌) రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రకా ష్‌కరత్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఆనంద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు తహసీల్దార్‌ అనితకు వినతిపత్రం ఇచ్చారు. బ్యాంకులతో సంబంధం లేకుుండా కార్పొరేషన్‌ నుంచే రుణాలివ్వాలన్నారు. ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు, ఇళ్లులేని వారికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, స్థలాలు ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ను నియమించాలన్నారు. యాదగిరి, పరమేష్‌, ప్రభాకర్‌, స్కైలాబ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-03T05:03:29+05:30 IST