శివాలయం రోడ్డు ఇలా..

ABN , First Publish Date - 2021-05-03T04:58:52+05:30 IST

శివాలయం రోడ్డు ఇలా..

శివాలయం రోడ్డు ఇలా..
శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారి నుంచి ఆలయానికి దారితీసే రోడ్డు

  • ఎవరూ పట్టించుకోకపోతే ఎలా?

కడ్తాల్‌: మండల పరిధిలోని మైసిగండి శివాలయానికి వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా పాడై రాకపోకలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల నుంచి భక్తులు వస్తుంటారు. కాగా రోడ్డు సరిగ్గా లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారి నుంచి శివాలయం వరకు ఉన్న రోడ్డు దాశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకనుగుణంగా నిర్మి ంచారు. ఈ రోడ్డుకు ఏళ్లుగా నిర్వాహ ణ లేక బీటీ కొట్టుకుపోయి, కంకర తే లింది. ద్విచక్ర వాహనాలు సైతం పో లేకుండా ఉంది. తరచూ దీంతో ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. కిలో మీటర్‌ మేర ఉన్న ఈ రోడ్డును ఆధునీకరించి డబుల్‌ రోడ్డుగా విస్తరి ంచాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంలో ఉన్న త స్థాయి ప్రజాప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శివాలయం రోడ్డును ఆధునికీకరించడంతో పాటు మైసమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డుకు కూడా సీసీ వేసి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-03T04:58:52+05:30 IST