12మంది బాల కార్మికులకు విముక్తి

ABN , First Publish Date - 2021-10-20T04:49:59+05:30 IST

ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధి మంగల్‌పల్లిలోని

12మంది బాల కార్మికులకు విముక్తి

  • మంగల్‌పల్లిలో ఓ గ్లాస్‌ కంపెనీపై దాడులు 
  • బాధ్యులైన ఇరువురికి రిమాండ్‌


ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధి మంగల్‌పల్లిలోని రిషబ్‌ ఇండస్ట్రీస్‌ గ్లాస్‌ కంపెనీలో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారన్న సమాచారం అందడంతో సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న ఛత్తీస్‌ఘడ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన 12మంది బాలకార్మికులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ దాడుల్లో రాచకొండ మానవ అక్రమ రవాణా నిలుపుదల టీం(ఏహెచ్‌టీయూ), బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌, స్పందన చైల్డ్‌లైన్‌ సభ్యులు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి కంపెనీ యజమాని ఎన్‌.భూపే్‌షజైన్‌ (44), లేబర్‌ కాంట్రాక్టర్‌ సునీల్‌ కుమార్‌ కోనౌజియా(27)లపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సైదులు తెలిపారు.

Updated Date - 2021-10-20T04:49:59+05:30 IST