మున్సిపాలిటీ అభివృద్ధికి నడుం బిగిద్దాం

ABN , First Publish Date - 2021-06-22T04:14:09+05:30 IST

మున్సిపాలిటీ అభివృద్ధికి నడుం బిగిద్దాం

మున్సిపాలిటీ అభివృద్ధికి నడుం బిగిద్దాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌


కొత్తూర్‌: నూతనంగా ఏర్పడిన కొత్తూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు నడుంబిగించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయ హాల్‌లో సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్యదేవేందర్‌యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు సమష్టి కృషితో మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ పనులతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని పలువురు కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అన్ని వార్డుల్లో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని ఏఈని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ డోలీ రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వీరేందర్‌, మేనేజర్లు మంజులత, అశోక్‌, ఏఈ నర్సింహులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొనానరు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కొత్తూర్‌ మండలానికి మంజూరైన 46 కల్యాణలక్ష్మి చెక్కులను షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈటే గణేష్‌, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శోభలింగంనాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లావణ్య, వెంకట్రామ్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:14:09+05:30 IST