వీధి వ్యాపారులందరికీ రుణాలివ్వాలి

ABN , First Publish Date - 2021-02-27T04:32:05+05:30 IST

వీధి వ్యాపారులందరికీ రుణాలివ్వాలి

వీధి వ్యాపారులందరికీ రుణాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు

వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు

జిల్లాలోని బ్యాంకర్లతో సమావేశం

వికారాబాద్‌: అర్హులైన వీధి వ్యాపారులకు నూ రుశాతం రుణాలు మంజూరు చేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు బ్యాంకు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో తన అధ్యక్షతన శుక్రవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 7,260 మంది అ ర్హులైన వీధి వ్యాపారులుండగా, ఇప్పటి వరకు 5,135 మందికి రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగతా వా రికి కూడా శనివారం బ్యాంకులకు సెలవుదినమైనా స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి నూరుశాతం అందజేయాలని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఎక్కువ పంట రుణాలు మంజూరు చేయాలని  సూచించారు. అలాగే జిల్లాలో ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమల స్థాపన రుణాల మం జూరులో వెనుకబడి ఉన్నామన్నారు. రూ.751కోట్ల రుణాల లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ.176 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చేసినట్లు తెలిపారు. డీఆర్డీఏ లింకేజీ కింద రూ.304 కోట్లు లక్ష్యానికి గానూ, రూ.265కోట్లు మంజూరు చేసి 87 శా తం లక్ష్యం సాధించినట్లు తెలిపారు. మిగితా రూ.39 కోట్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలని అన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి గత 2014-15 నుంచి పెండింగ్‌లో ఉన్న రుణాలను మార్చి 10లోగా పూర్తిచేయాలని సూచించారు. ఎస్సీలకు 148, ఎస్టీలకు 159, మైనార్టీలకు 147 రుణాల యూనిట్లను స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎల్డీఎం రాంబాబు, డీఆర్డీవో కృష్ణన్‌, ఆర్బీఐ ఏజీఎం చంద్రకాంత్‌, నాబార్డు డీడీ ఎం నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:32:05+05:30 IST