కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-06-23T03:57:25+05:30 IST

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చేవెళ్ల: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఒంటిపై పె ట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసిన ఘటన చేవెళ్ల మం డలం కందవాడ స్టేజీ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ విజయ్‌భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రేగడి దోస్వాడకు చెందిన పిసరి ప్రభాకర్‌రెడ్డికి భార్య చంద్రకళ, కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితం నగరంలోని రామంతాపూర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఫైౖనాన్స్‌, చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. కాగా భార్యతో కలిసి కం దవాడలో ఉన్న తన చెల్లెలు ఇంటికి ఈ నెల 21న వెళ్లాడు. మంగళవారం ఉదయం బయటకు వెళ్లివస్తానని చెప్పి హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపైకి రాగా నే తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. వాహనదారులు మంటలార్పి పోలీసులకు, 108కు సమచారమిచ్చారు. మెరుగైన వై ద్యం కోసం నగరంలోని  ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్‌రెడ్డి భూమి విషయమై కేసు కోర్టు ఉండటం, కుటుంబ కలహాలు, ఆర్థిక పరిస్థితి వల్లే అతడు ఆత్మహత్యా యత్నం చేశాడని కుటుంబీకులు చెబుతున్నారు. పరిస్థితి విషయమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-23T03:57:25+05:30 IST