రోడ్డు పక్కనే చేపల విక్రయం

ABN , First Publish Date - 2021-05-31T05:14:16+05:30 IST

రోడ్డు పక్కనే చేపల విక్రయం

రోడ్డు పక్కనే చేపల విక్రయం
ఆమనగల్లులో రోడ్డుపైనే కొనసాగుతున్న చేపల అమ్మకాలు

  • ఇబ్బంది పడుతున్న వ్యాపారులు, కొనుగోలుదారులు 
  • షెడ్లు నిర్మించాలని ప్రభుత్వానికి వినతి 

ఆమనగల్లు: ఆమనగల్లులో చేపల విక్రయానికి నిర్దిష్ట స్థలం లేదు. దీంతో ఇటు విక్రయ దారులు, అటు కొనుగోలు దారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరానికి చేరువలో నాలుగు మండలాలకు కూ డలిగా ఉన్న ఆమనగల్లులో చేపల విక్రయాలకు ప్రత్యేక స్థలం కేటాయించి షెడ్లు ఏర్పాటు చేయాలని మత్య్సకారులు, అమ్మకందారులు ఏళ్లుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఆమనగల్లు పట్టణంలో అనేక మత్స్యకారులు, ముదిరాజ్‌ కుటుంబాలు చేపల అమ్ముకుంటూ ఉపాధి పొందుతున్నారు. మార్కెట్‌ షెడ్‌ లేక మాడ్గుల రోడ్డులో పోలీ్‌సస్టేషన్‌ వెనక చేపల విక్రయాలు సాగిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులు రోడ్డు పక్కన ఇబ్బంది పడుతున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, డిండి, హైదరాబాద్‌ మార్కెట్ల నుంచి చేపలు తెచ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. స్థానికంగా షెడ్లు, సరైన వ సతుల్లేక చేపలను నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని వ్యాపారులు వాపోతున్నారు. కొన్ని సందర్భాలలో గిరాకీ లేక చేపలను నిల్వచేసుకోలేక మురిగిపోతున్నాయ ని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదిలి చేయూతనందిస్తున్నా తమ లాంటి విక్రయదారులకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తున్నా గిట్టుబాటు కావడంలేదంటున్నారు. చేపల మార్కెట్‌ ఏర్పాటు చేస్తే గిరాకీ పెరుగుతుందన్నారు. షెడ్డు నిర్మించాలని మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు.


  • ప్రభుత్వం చేయూతనివ్వాలి

చేపల విక్రయదారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. మాకు పెట్టుబడి సాయం కల్పించాలి. విక్రయాలకు పట్టణంలో ప్రత్యేక స్థలం కేటాయించి షెడ్లు నిర్మించాలి. ఆ దిశగా ప్రజాప్రతినిదులు, అధికారులు చొరవ తీసుకోవాలి. చేపలు నిల్వ చేసుకోవడానికి సదుపాయం కల్పించాలి. ఏళ్లుగా మేం విక్రయానికి ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైన మా సమస్యను పరిష్కరించాలి.

- బొల్లు లక్ష్మమ్మ, చేపల అమ్మకందారు, ఆమనగల్లు 


  • వెంటనే మాకు షెడ్లు నిర్మించాలి

ఆమనగల్లు పట్టణంలో చేపల విక్రయానికి నిర్దిష్ట స్థలం కేటాయించి షెడ్లు నిర్మించాలి. చేపలు నిల్వ చేసుకోవడానికి ఫ్రీజర్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. మత్య్సకారుల సంక్షేమానికి, ఉపాధికి ప్రభుత్వం తోడ్పాటునందించాలి. వ్యాపార వృద్ధికి రైతుల మాదిరిగా వడ్డీ లేని రుణాలు అందించాలి. ఆమనగల్లులో అనేక కుటుంబాలు చేపల విక్రయాల ఆధారంగా ఉపాధి పొందుతున్నాయి. ఇక్కడ మినీ మార్కెట్‌ ఏర్పాటు చేయాలి.

- మొక్తాల వెంకటయ్య, జిల్లా ముదిరాజ్‌ సంఘం ఉపాధ్యక్షుడు

Updated Date - 2021-05-31T05:14:16+05:30 IST