రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-05-05T06:01:13+05:30 IST

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి

శామీర్‌పేట : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన మంగళవారం శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి నుంచి కొల్తూర్‌ వెళ్లే రోడ్డుమార్గంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అల్వాల్‌కు చెందిన జగదీశ్‌(42)గా గుర్తించారు. అలాగే మరో వ్యక్తి ఒడిషా రాష్ర్టానికి చెందిన వ్యక్తిగా గుర్తించి వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • సిమెంట్‌ ట్యాంకర్‌ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు

వికారాబాద్‌ : అదుపుతప్పి ఓ సిమెంట్‌ ట్యాంకర్‌ బోల్తా పడి డ్రైవర్‌కు గాయాలైన సంఘటన వికారాబాద్‌ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి తాండూరు వెళుతున్న సిమెంట్‌ ట్యాంకర్‌ (ఏపీ04 యూబీ 3344) అనంతగిరి ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ ఉపేందర్‌కు గాయాలయ్యాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-05-05T06:01:13+05:30 IST