భూ పరిపాలనలోధరణి విప్లవాత్మకమైన మార్పు
ABN , First Publish Date - 2021-10-30T04:11:56+05:30 IST
భూ పరిపాలనలోధరణి విప్లవాత్మకమైన మార్పు

- జిల్లాలో ధరణి అమలుతీరు సమర్థవంతం
- 94.92 శాతం ఫిర్యాదుల పరిష్కారం
- కలెక్టరేట్‌లో ధరణి వార్షికోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిఖిల
ఆంధ్రజ్యోతి, వికారాబాద్ జిల్లా ప్రతినిధి / (ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి / వికారాబాద్: భూపరిపాలనా రంగంలో ఽధరణి ఓ విప్లవాత్మకమైన మార్పని, జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతూ ఇప్పటి వరకు 94.92లక్ష్యం సాధించినట్లు కలెక్టర్ కె.నిఖిల తెలిపారు. ధరణి ప్రారంభమైన ఏడాదైన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేక్‌కట్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఽఽధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో ట్యాంపర్‌ప్రూ్‌పగా ఉంటూ వివక్షలేని సురక్షితమైన సేవలు అందించే అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ అని అన్నారు. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్ స్టాప్ పరిష్కారాన్ని అందిస్తోందని చెప్పారు. జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేస్తున్న సహచర అధికారులు, తహసీల్దార్లు, ఇతర సిబ్బందిని అభినందించారు. ధరణిఅమలుకు సహకారం అందిస్తున్న రాష్ట్ర స్థాయి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ధరణి అమలుతో రిజిస్ట్రేషన్‌తో పాటు వెంటనే మ్యుటేషన్ జరిగే సదుపాయం ఏర్పడిందని, పాస్ పుస్తకాలు ఇంటికి చేరతాయని, ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ధరణిలో ప్రస్తుతం 31 రకాల లావాదేవీల మాడ్యుల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యు ల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఏడాది కాలంలో జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా 90,201 స్లాట్‌లు బుక్ కాగా, వాటిలో 85,619 ఫిర్యాదులు పరిష్కరించి 94.92 శాతం లక్ష్యం చేరుకున్నామని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న 4,582 ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. నిషేఽధిత భూములపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నెల రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పూడూరు, పరిగి, దోమ తహసీల్దార్లు కిరణ్, విద్యాసాగర్‌రెడ్డి, వహీదా ఖాతూన్‌లను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ నిఖిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీధర్, ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి విజయేందర్, దీపక్, వివిధ మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ధరణి సేవలకు ఏడాది..
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలను పరిష్కారించామని ఇన్‌చార్జి కలెక్టర్ హరీష్ అన్నారు. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అలోచనల మేరకు రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా భూసమస్యలను పరిష్కరించామన్నారు. ధరణి పోర్టల్‌లో భూ వివరాల నమోదులో రెవెన్యూ యంత్రాంగం పనితీరు అభినందనీయమన్నారు. జిల్లాలో 3,883 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. 650 గిఫ్ట్‌డీడీలు, 611 వారసత్వం, 6,264 మ్యుటేషన్లు జరిగాయన్నారు. జిల్లాలో 2,772 భూ సంబంధిత ఫిర్యాదులు, 2,528 నిషేధిత భూముల పై ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటి పరిష్కారానికి గ్రామాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలి
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, పంట రుణాలపై డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో రూ.1,028కోట్ల రుణలక్ష్యం కాగా, గతనెల సెప్టెంబరు వరకు 80, 513 మందిరైతులకు రూ.813 కోట్ల రుణాలు అందించామని ఎల్‌డీఎం రాంబాబు తెలిపారు. వ్యవసాయ, కులపరిమితి రుణాల కింద జిల్లాలో 963కోట్ల లక్ష్యానికి రూ.364 కోట్లు మం జూరు చేయడం జరిగిందన్నారు. సూక్ష్మా, చిన్న, మధ్యతరగతి వర్తకులకు రూ. 836 కోట్లు రుణ లక్ష్యానికి రూ.358 కోట్లు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్‌కు తెలిపారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు జిల్లాలో 52 శాతం, వీధి వ్యాపారులకు 91 శాతం రుణాలు అందించామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రుణాలను ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి నవంబరు నెలాఖరు వరకు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం 2022-23 ప్రొటెన్షియల్ లింకుడ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్‌డీవో కృష్ణన్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, ఉద్యానశాఖ అధికారి చక్రపాణి, ఎల్‌డీవో, పూర్ణిమ, సిరిశర్మ, బాలసుబ్రహ్మణ్యం, సయ్యద్ యూసఫ్ పాల్గొన్నారు.