భూ వివాదానికి త్వరలో పరిష్కారం : ఆర్డీవో
ABN , First Publish Date - 2021-03-25T05:09:17+05:30 IST
భూ వివాదానికి త్వరలో పరిష్కారం : ఆర్డీవో

ఘట్‌కసర్ రూరల్: ప్రతా్‌పసింగారం, భవానీనగర్ ప్లాట్ ఓనర్స్‌కు, భూమి పట్టదారుల వివాద పరిష్కారానికి ఆర్డీవో మల్లయ్య, తహసీల్దార్ విజయలక్ష్మి బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతా్‌పసింగారంలోని 315, 316, 317లలో 25ఎకరాల 17గుంటల భూమిలో 1988లో మలిపెద్ది బుచ్చిరెడ్డితో బీపీఏ తీసుకొని భవానీనగర్ పే రుతో వెంచర్ చేసి 390ప్లాట్లు విక్రయించారు. అయితే ప్లాట్ల ఓనర్లకు కాకుండా పాత పట్టదారులకు పాసుపుస్తకాలు వచ్చాయి. ప్లాట్ ఓనర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బుచ్చిరెడ్డి జీపీవో ప్రకారం 390ప్లాట్లను మినహాయించి మిగిలిన భూమిని పట్టదారులు తీసుకోవాలని ఆర్డీవో సూచించారు. కార్యక్రమంలో ప్లాట్ ఓనర్లు భాస్కర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, యాదగిరి, రాజ్‌కుమార్, మల్లేష్, జితేందర్ పాల్గొన్నారు.
- డాక్టర్ శ్రవణ్‌కుమార్‌కు ఉత్తమ అవార్డు
పెద్దేముల్: పీహెచ్‌సీ వైద్యులు శ్రవణ్‌కుమార్ కలెక్టర్ పౌసుమి బసు చేతుల మీ దుగా బుధవారం ఉత్తమ డాక్టర్ అవార్డు అందుకున్నారు. శ్రవణ్‌కుమార్ టీబీ రోగుల ను గుర్తించడంలో విశేష కృషిచేశారు. రోగులకు ఎప్పటికప్పుడు చికిత్సలు చేస్తూ మొద టి స్థానంలో నిలిచారు. టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డు అందుకున్నారు.