వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-12-08T04:56:31+05:30 IST

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, తదితరులు

పరిగి: పరిగిలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి కల్యాణ మహోత్సం వైభవంగా జరిగింది. ఉదయం విష్ణుసహస్రనామ పారాయణం, మధ్యాహ్నం స్వామివారికి అభిషేకం, హోమాలు నిర్వహించారు. సాయంత్రం యాదాద్రి దేవాలయం పండితులు కొడకండ్ల రామశరణ్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ప్రతిమారెడ్డి, ఆలయ ధర్మకర్త ఎదిరె సత్యనారాయణ. మణెమ్మ దంపతులు కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే  మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.

Updated Date - 2021-12-08T04:56:31+05:30 IST