లేబర్‌ కోడ్‌లనూ రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-11-24T04:54:05+05:30 IST

లేబర్‌ కోడ్‌లనూ రద్దు చేయాలి

లేబర్‌ కోడ్‌లనూ రద్దు చేయాలి
మాట్లాడుతున్న చంద్రయ్య

షాద్‌నగర్‌అర్బన్‌: కేంద్రం సాగు చట్టాలను రద్దు చేసినట్లు లేబర్‌ కోడ్‌లనూ రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.చంద్రయ్య డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలని రైతులు 18నెలల పాటు నిరంతరంగా పోరాటం చేయడంతోనే కేంద్రం దిగివచ్చి మూడు సాగుచట్టాలను రద్దు చేసిందన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చేపట్టిన రైతు పోరాటాలను ఆదర్శంగా తీసుకుని కార్మికులు కూడా సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నాయకుడు పానుగంటి పర్వతాలు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు ఓరుగంటి యాదయ్య, రామస్వామి, నర్సింహారెడ్డి, దత్తునాయక్‌, వి. సత్యనారాయణ, ఎస్‌.శ్రీఖర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-24T04:54:05+05:30 IST