ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినకోటిరెడ్డి
ABN , First Publish Date - 2021-12-27T05:08:50+05:30 IST
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినకోటిరెడ్డి

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌జిల్లా ప్రతినిధి): వికారాబాద్ జిల్లా ఎస్పీగా ఎన్.కోటిరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసు అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అంతకుముందు ఎస్పీ సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసు యంత్రాంగానికి జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏంఏ రషీద్, వికారాబాద్, పరిగి, తాండూరు డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కుటుంబ సమేతంగా అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్.పద్మనాభం, ఈవో నరేందర్, అదనపు ఎస్పీ రషీద్, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాజశేఖర్ పాల్గొన్నారు.