కేఎల్‌ఐ డీ-82 పనులు త్వరగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-05-21T04:26:10+05:30 IST
కేఎల్‌ఐ డీ-82 పనులు త్వరగా పూర్తిచేయాలి

- ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్
ఆమనగల్లు : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాలువ అసంపూర్తి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్ అధికారులకు సూచించారు. వానాకాలం నాటికి పనులు పూర్తిచేసి సాగునీరందించేలా చొరవ తీసుకోవాలని అన్నారు. ఆమనగల్లు-వెల్దండ మండలాల మధ్య కేఎల్‌ఐ డీ-82 కాలువ నిర్మాణం పనులను గురువారం ఇరిగేషన్ అధికారులు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులతో కలిసి జైపాల్‌యాదవ్ పరిశీలించారు. ఈ కాలువ ద్వారా ఆమనగల్లు, వెల్దండ, మాడ్గుల మండలాల పరిధిలో 35వేల ఎకరాలకు సాగునీరందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా వచ్చే రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరందించి రైతుల కలలు సాకారం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీకాంత్, డీఈఈ దేవన్న, కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ బాలయ్య, ఎంపీపీ విజయ, వైస్‌ఎంపీపీ శాంతి, నాయకులు భూపతిరెడ్డి, రాజశేఖర్, గోపాల్‌నాయక్, జైపాల్‌నాయక్, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.