జూన్‌లోగా కేఎల్‌ఐ డి-82 కాల్వ పనులు పూర్తి
ABN , First Publish Date - 2021-03-24T05:38:13+05:30 IST
జూన్‌లోగా కేఎల్‌ఐ డి-82 కాల్వ పనులు పూర్తి

- సీఎం కేసీఆర్ ఆదేశం
- ఎమ్మెల్సీ నారాయణరెడ్డి వెల్లడి
ఆమనగల్లు: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి-82 కాల్వ నిర్మాణ పనులను జూన్ నెలాఖరుకు పూర్తిచేసి ఆమనగల్లు, వెల్దండ, మాడ్గుల మండలాల్లో 35వేల ఎకరాలకు నీరందిస్తామని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పనుల పూర్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ డి-82 కాల్వ పనులు 90శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు వెంటనే చేపడుతున్నట్టు చెప్పారు. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారన్నారు. కేఎల్‌ఐకి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనులను అనుసంధానించేలా ప్రతిపాదించాలని సీఎం అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. సమావేశంలో ఎంపీపీలు అనితవిజయ్, కమ్లీమోత్యనాయక్, వైస్‌ఎంపీపీ ఆనంద్, జంగయ్య, భాస్కర్‌రెడ్డి, శివలింగం, శేఖర్, బాబా, పురుషోత్తం పాల్గొన్నారు. ఎమ్మెల్సీకి సత్కారం.. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో నారాయణరెడ్డిని ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించడంతో స్వీటు తినిపించారు. ఎంపీడీవో వెంకట్రాములు, సూపరింటెండెంట్ రమేశ్, ఎపీవో ఉమారాణి పాల్గొన్నారు.