కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2021-11-10T05:07:45+05:30 IST

కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం

కేసీఆర్‌ పథకాలు దేశానికే ఆదర్శం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 


పరిగి: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అరవింద్‌రావు అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయశాఖలో ఎలాంటి సబ్సిడీ పరికరాలు రావడంలేదని సయ్యద్‌పల్లి సర్పంచ్‌ సభాదృష్టికి తీసుకొచ్చారు. పశువైద్యశాలలో వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించక గ్రామాల్లో పశువులు మృత్యువాత పడుతున్నాయని, పశువైద్యశాలకు వెళితే ఎలాంటి మందులు లేవని డాక్టర్లు చెబుతున్నారని సభాదృష్టికి తీసుకొచ్చారు. ప్రైవేట్‌లో ఇష్టానుసారంగా మందులకు డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు సర్పంచులు సభాదృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధనలు నేర్పించేవారు వాటిని మర్చిపోయి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని రూఫ్‌ఖాన్‌పేట్‌ సర్పంచ్‌ ఐ.నర్సింహా సభాదృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎంఈవో హరిశ్చందర్‌ ప్రతి ఉపాధ్యాయుడు ఆఫీస్‌రూంలోనే సెల్‌ఫోన్‌ పెట్టి తరగతి గదిలోకి వెళ్లాలని లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా కో-ఆప్షన్‌ నజిరోద్దీన్‌, ఎంపీడీవో శేషగిరి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేందర్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-10T05:07:45+05:30 IST