ఎమ్మెల్సీ కసిరెడ్డి ఉదారత

ABN , First Publish Date - 2021-07-25T05:07:36+05:30 IST

ఎమ్మెల్సీ కసిరెడ్డి ఉదారత

ఎమ్మెల్సీ కసిరెడ్డి ఉదారత
నరేందర్‌కు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి

  • రూ.లక్ష సాయం అందజేత

ఆమనగల్లు: ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. 38రోజుల శిశువు కాలేయ మార్పిడి వైద్యానికి రూ.లక్ష అందజేశారు. ఆమనగల్లుకు చెందిన దాస్యం సాయికిరణ్‌-అఖిల దంపతులకు 38రోజుల క్రితం పుట్టిన పాప జన్యు సంబంధ లోపంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంది. వైద్యులు శిశువుకు కాలేయ మార్పిడికి  రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. సాయమందించాలని తల్లిదండ్రులు ఎమ్మెల్సీని కలిసి అభ్యర్థించగా కసిరెడ్డి స్పందించి పాప వైద్యం గురించి మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకుపోయారు. వ్యక్తిగతంగా రూ.లక్ష సాయాన్ని ప్రకటించి చెక్కు అందజేశారు.

Updated Date - 2021-07-25T05:07:36+05:30 IST