జ్యోతిరావు ఫూలే సేవలు మరువలేనివి
ABN , First Publish Date - 2021-11-29T05:20:58+05:30 IST
జ్యోతిరావు ఫూలే సేవలు మరువలేనివి

- పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పామెన భీంభరత్
- ఘనంగా ఫూలే వర్థంతి
షాబాద్/చేవెళ్ల/కడ్తాల్/తలకొండపల్లి/కొత్తూర్/కందుకూరు: దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన సేవలు మరువలేనివని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పామెన భీంభరత్, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి అన్నారు. జ్యోతిరావుపూలె వర్థంతిని పురస్కరించుకొని షాబాద్, చేవెళ్లలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫూలే గొప్ప సంఘసంస్కర్త, ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. మహిళల విద్య కోసం ఆయన ఎంతో పోరాటం చేశారని అన్నారు. మహానీయుల అడుగుజాడలో నడుద్దామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, నాయకులు యాదయ్య, రాంచందర్, అశోక్, కలిల్‌పాష, సత్యనారాయణ, నర్సింహులు, ప్రభాకర్, జంగయ్య, మహేష్, నర్సింహులు, జైపాల్, నరేందర్, సున్నపు ప్రవీణ్, జంగయ్య, శివకుమార్, అశోక్, గోపాల్, ప్రవీణ్, ప్రసాద్, శ్రీకాంత్, నరేందర్ పాల్గొన్నారు. అదే విధంగా కడ్తాల మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతిరావుపూలే వర్థంతిని ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘం మండల అధ్యక్షుడు పిప్పళ్ల వెంకటేశ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా పలుసేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థలో మార్పు కోసం కారల్ మార్క్స్ కృషి చేస్తే సాంఘిక వ్యవస్థలో మార్పు కోసం పూలే కృషి చేశారన్నారు. ఆడపిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలలను స్థాపించిన ఘనత ఫూలేదేనన్నారు. నిరక్ష్యరాస్యత నిర్మూలన కోసం పూలే జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రోళ్ల రాఘఽవేందర్, మూడ రవి, సిద్దిగారి దాసు, కె.చందోజీ, లాయక్‌అలీ, మల్లేశ్‌గౌడ్, రాజేందర్‌గౌడ్, క్యామ రాజేశ్, రాజు, యాదయ్య, దేవేందర్‌గౌడ్, మల్లయ్య, సత్యం, వెంకటేశ్, నాగార్జున, భానుకిరణ్, రామకృష్ణ, జంగయ్య, రమేశ్, చెన్నయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో జ్యోతిరావుఫూలే వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు సుధాకర్, నర్సింహ, కృష్ణ, కుమార్, కిరణ్, శ్రీశైలం, గణేశ్, మహేశ్, సురేశ్, రామయ్య, సందీప్, వంశీ, అనిల్, గణేశ్ పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తూరులోని చౌరస్తా వద్ద గల పూలే విగ్రహానికి బీసీ సంఘం సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ బి.దేవేందర్‌యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ డోలీ రవీందర్, నాయకులు జనార్దన్‌చారి, యాదయ్య, ఆంజనేయులుగౌడ్, సిటీకేబుల్ వెంకటేష్, శివకుమార్, శ్రీనివా్‌సరెడ్డి, లక్ష్మయ్య, నర్సింహ, రాఘవేందర్‌యాదవ్, నర్సింహ, గోవింద్‌నాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరులో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డి.రాంచందర్, మండల కార్యదర్శి ఆర చందులు పూలేకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కుమార్, బి.శ్రీనివాస్, ఎస్. కృష్ణ , అంజయ్య పాల్గొన్నారు.