ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-12-29T05:07:06+05:30 IST

ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలి

ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలి
ఆందోళన చేస్తున్న ప్లాట్‌ యజమానులు

కీసర రూరల్‌ : ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఉప్పల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీవీఎస్‌ ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. మంగళవారం నాగారం మున్సిపాలిటీ శ్రీపురం కాలనీవాసులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమానికి ఆయన మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. నాగారం రెవెన్యూ పరిధి సర్వేనంబర్‌ 148లో ఏర్పాటుచేసిన లేఅవుట్‌లో కొందరు ప్లాట్లను కొనుగోలు చేశారని, వాటిని టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు కబ్జాచేసి, అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నిరుపేదలైన ప్లాట్ల కొనుగోలుదార్లకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో రాంపల్లి మాజీ సర్పంచ్‌ మునిగంటి  జ్యోతి, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T05:07:06+05:30 IST