జీవీకే, ఈఎంఆర్‌ఐ-108 సంస్థలో ఉద్యోగ నియామకాలు

ABN , First Publish Date - 2021-05-08T05:34:11+05:30 IST

జీవీకే, ఈఎంఆర్‌ఐ-108 సంస్థలో ఉద్యోగ నియామకాలు

జీవీకే, ఈఎంఆర్‌ఐ-108 సంస్థలో ఉద్యోగ నియామకాలు

కందుకూరు : జీవీకే, ఈఎంఆర్‌ఐ-108 సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేయుటకు  నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ నరేందర్‌  శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పైౖలెట్స్‌, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 10న హయత్‌నగర్‌లోని 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పైలెట్స్‌ నియామకానికి 10వ తరగతి ఉత్తీర్ణత, బ్యాడ్జ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఈఎంటీ నియామకానికి బీఎస్సీ(బీజడ్‌సీ) లేదా లైఫ్‌ సైన్స్‌ గ్రూప్‌, బీఎస్సీ ఎంఎల్‌టీ, డీఎంఎల్‌ కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా హయత్‌నగర్‌లోని తమ కార్యాలయానికి రావాలని కోరారు. ఇతర సమాచారానికి 9154269817 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2021-05-08T05:34:11+05:30 IST