మేడ్చల్‌ జిల్లా విద్యాధికారికి జ్ఞానరత్న అవార్డు

ABN , First Publish Date - 2021-10-26T04:27:26+05:30 IST

మేడ్చల్‌ జిల్లా విద్యాధికారికి జ్ఞానరత్న అవార్డు

మేడ్చల్‌ జిల్లా విద్యాధికారికి జ్ఞానరత్న అవార్డు
అవార్డును అందుకుంటున్న ప్రసాద్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లాప్రతినిధి): మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా విద్యాశాఖలో పలు మార్పులకు శ్రీకారం చుట్టి అమలు చేసినందుకు  జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 23న రాత్రి గోవాలో  గ్లోబల్‌ స్కాలర్స్‌ ఫౌండేషన్‌ఆధ్వర్యంలో జ్ఞానరత్న అవార్డునుఅందుకున్నారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించడంతో పాటు, నిత్యం పాఠశాలల సందర్శన, ఉపాధ్యాయులతో మాట్లాడడం, కరోనా సమయంలో విద్యార్థులకు అన్‌లైన్‌ తరగతుల నిర్వాహణపై ప్రత్యేక శ్రద్ధ్ద చూపడం, మేడ్చల్‌ బడి. డాట్‌కామ్‌ ప్రారంభించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు అరుదైన గౌరవం దక్కింది.  ఈ సందర్భంగా డీఈఓ ప్రసాద్‌ను  రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన, ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌, ఉపాధ్యా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-10-26T04:27:26+05:30 IST