‘చర్లపల్లి’లో జైల్ అదాలత్
ABN , First Publish Date - 2021-07-25T05:18:09+05:30 IST
‘చర్లపల్లి’లో జైల్ అదాలత్

కుషాయిగూడ : చర్లపల్లి కేంద్ర కారాగారంలో శనివారం నిర్వహించిన ‘జైల్ అదాలత్’లో 320 కేసులు పరిష్కరించగా, 280 మంది ఖైదీలకు విముక్తి లభించింది. చంచల్‌గూడకు చెందిన 23 ఖైదీలు, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్‌కి చెందిన ఆరుగురు మహిళా ఖైదీలు, సంగారెడ్డి జిల్లా జైలుకు చెందిన 28 మంది ఖైదీలకు సంబంధించిన కేసులు పరిష్కారమయ్యాయి. ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వివిధ మెట్రోపాలిటన్ కోర్టులతో పాటు హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్, చేవెళ్ల సెషన్స్ కోర్టులకు సంబంధించిన కేసులను విచారించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనుపమా చక్రవర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉదయ్‌కుమార్, ఆంజనేయులు పర్యవేక్షణలో మేజిస్ట్రేట్‌లు కె.కవిత, జి.కవిత, ఎ.నాగరాజు, బి.సంజయ్, కె.అజే్‌షకుమార్ తదితరులు కేసులను విచారించారు.