టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

ABN , First Publish Date - 2021-07-13T05:24:51+05:30 IST

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరుతున్న కౌన్సిలర్‌ అనురాధ-రాఘవరెడ్డి దంపతులు

ఘట్‌కేసర్‌/శామీర్‌పేట : ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ కౌన్సిలర్‌(కాంగ్రెస్‌) కొమ్మిడి అనురాధ, ఆమె భర్త కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొమ్మిడి రాఘవరెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలుపొందగా, ఇద్దరు కౌన్సిలర్లు ఇప్పటికే టీఆర్‌ఎ్‌సలో చేరారు. ప్రస్తుతం కౌన్సిలర్‌ అనురాధ సైతం అధికార పార్టీలో చేరడంతో మున్సిపాలిటీలో ప్రతిపక్షం లేకుండా పోయింది. అదేవిధంగా ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌, మంత్రి మల్లారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట ఎంపీటీసీ ఇందిర, పొన్నాల్‌ ఎంపీటీసీ మౌనిక శివవరప్రసాద్‌లు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో శామీర్‌పేట ఎంపీపీ దాసరి ఎల్లూబాయి, తదితరులున్నారు.

Updated Date - 2021-07-13T05:24:51+05:30 IST