జిల్లా విద్యాశిక్షణ సంస్థలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-29T05:09:03+05:30 IST

జిల్లా విద్యాశిక్షణ సంస్థలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా విద్యాశిక్షణ సంస్థలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్‌: జిల్లా విద్యాశిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న 14 పోస్టుల్లో పనిచేయడానికి విశ్రాంత ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయ ఉపన్యాసకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు  కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రామాచారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అతిథి ఉపన్యాసకులు తెలుగు-ఇంగ్లీష్‌, ఉర్దూ-ఇంగ్లీష్‌లలో విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఒక విద్యా సంవత్సర కాలం లేదా రెగ్యులర్‌గా నియమింపబడిన సమయం వరకు పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ.18వేల కన్సాలిడేషన్‌ జీతం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. ఇందులో ఫిలాసఫీ/సోషియాలజీ, సైకాలజీ, సైన్స్‌-పెడగాజి, మ్యాథమెటిక్స్‌-పెడగాజి, సోషల్‌ సైన్స్‌-పెడగాజి, ఇంగ్లీష్‌, తెలుగు, హెల్త్‌ అండ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, విజువల్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఫెర్‌ఫామింగ్‌ ఆర్ట్స్‌, ఉర్దూ సబ్జెక్టులకు సంబంధిత పీజీ, ఎంఈడీ కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 29 నుంచి 01వ తేదీ లోపు కళాశాల ప్రిన్సిపాల్‌ను స్వయంగా కలిసిగానీ, పోస్టు ద్వారా కానీ బయోడేటా వివరాలతో సంప్రదించవచ్చని తెలిపారు.  నవంబర్‌ 3 నుంచి 5వ తేదీ వరకు మాదిరిబోధన తరగతితోపాటు ఇంటర్వ్యూ, 6న ఎంపిక జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. వివరాలకు 9949993715 నంబరును సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2021-10-29T05:09:03+05:30 IST