కేజీబీవీల్లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-09T05:52:01+05:30 IST

కేజీబీవీల్లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీల్లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

  • ఈ నెల 11వ తేదీ తుది గడువు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్‌(సీఆర్టీ) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నట్లు డీఈవో సుశీందర్‌రావు సోమవారం తెలిపారు. 15సీఆర్టీ 22పీజీ సీఆర్టీ పోస్టులకు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా వాసులై ఉండాలని పేర్కొన్నారు. 

ఖాళీల వివరాలు.. కేజీబీవీ కేశంపేటలో 2సీఆర్టీ, 4పీజీసీఆర్టీ పోస్టులు ఉన్నాయి. సీఆర్టీ తెలుగు, ఫిజికల్‌ సైన్స్‌, పీజీసీఆర్టీ ఇంగ్లీష్‌ ఎకనామిక్స్‌, నర్సింగ్‌-1, నర్సింగ్‌-2 పోస్టులు ఉన్నాయి. కొందుర్గులో తెలుగు మీడియం సీఆర్టీ 2. ఫిజికల్‌ సైన్స్‌, పీఈటీ, కొందుర్గులోనే ఇంగ్లీష్‌ మీడియంలో పీజీసీఆర్టీ పోస్టులు 7 ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్‌, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, నర్సింగ్‌-1, నర్సింగ్‌-2 పోస్టులు ఉన్నాయి. కడ్తాల్‌లో ఇంగ్లీష్‌ మీడియం సీఆర్టీ పీఈటీ, కొత్తూరులో సీఆర్టీ తెలుగు, మాడ్గులలో పీఈటీ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తలకొండపల్లిలో సీఆర్టీ ఫిజికల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, తెలుగు, సోషల్‌, శంషాబాద్‌లో సీఆర్టీ తెలుగు, సోషల్‌ స్టడీస్‌ ఖాళీగా ఉన్నాయి. శంకర్‌పల్లిలో పీజీసీఆర్టీ నర్సింగ్‌, పీఈటీ పోస్టులు, మహేశ్వరంలో కేజీబీవీలో పీఈటీ, పీజీసీఆర్టీ తెలుగు, ఇంగ్లీష్‌, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, నర్సింగ్‌-1, న్ససంగ్‌-2 పోస్టులున్నాయి. మంచాల్‌లో సీఆర్టీ మాథ్స్‌, మొయినాబాద్‌లో హిందీ పోస్టులు, ఇబ్రహీంపట్నం కేజీబీవీలో పీజీసీఆర్టీ బాటనీ, మ్యాథ్స్‌ పోస్టులు ఉన్నట్టు డీఈవో వివరించారు.

Updated Date - 2021-11-09T05:52:01+05:30 IST