ఇంటర్ పరీక్ష ప్రశాంతం
ABN , First Publish Date - 2021-10-26T04:52:30+05:30 IST
ఇంటర్ పరీక్ష ప్రశాంతం

వికారాబాద్/తాండూరు/పెద్దేముల్/పరిగి/దోమ/కొడంగల్ /మేడ్చల్/ఘట్‌కేసర్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు శానిటైజర్ వేసి, టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 9గంటలకు మొదటి పరీక్ష ప్రారంభం కాగా వికారాబాద్ పట్టణంలో ఎనిమిది సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 2585 మంది హాజరు కావాల్సి ఉండగా 2404మంది హాజరయ్యారు. 181 మంది గైర్హాజరయ్యారు. తాండూరులో 2707 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, 2,484 మంది విద్యార్థులు హాజరయ్యారు. 223 మంది గైర్హాజరయ్యారు. తాండూరులో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్ విభాగంలో 2,195 మంది విద్యార్థులకు గానూ 170 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 512 మందికి గానూ 53మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షాకేంద్రం ఏర్పాటులో అయోమయానికి గురైన ఓ విద్యార్థి పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లడంతో సిబ్బంది అనుమతించలేదు. ఈసారి కొత్తగా రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కోకట్ గ్రామ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలు చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో మొత్తం 258 మంది విద్యార్థులకు గానూ 225మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. 33మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరిగి: ఇంటర్మీడియట్ ప్రఽథమ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. పరిగి పట్టణంలో ఐదు పరీక్షాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెసిరెన్సియల్ కళాశాల, విజ్ఞాన్, పల్లవి, మాడల్ స్కూల్‌లలో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఐదు పరీక్షా కేంద్రాల్లో కలిపి 1626 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 1522 మంది విద్యార్థులు హాజరయ్యారు. 104 విద్యార్థులు గైరాజరయ్యాకని కస్టోడియన్ విజయ్‌కుమార్ తెలిపారు. దోమ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 315 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ మంజుల తెలిపారు. కొడంగల్‌లో సోమవారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రంలో 9,0237 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 8, 493 మంది హాజరైనట్లు నోడల్ అధికారి శంకర్ తెలిపారు. అదేవిధంగా మేడ్చల్‌లో పరీక్షకేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసి సదుపాయాలు కల్పించారు. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఘట్‌కేసర్‌లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల, రుషి జూనియర్ కళాశాల, వివేకానంద జూనియర్ కళాశాల, శ్రీ భవిత జూనియర్ కళాశాలల్లో పరీక్ష సెంటర్లును ఏర్పాటు చేశారు. 8.30గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం తొమ్మిది గంటల వరకు విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశామని శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపల్ పద్మారెడ్డి తెలిపారు.